పిడుగురాళ్ల మండంలోని జూలకల్లు గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిపై కొంతమంది వ్యక్తులు దాడి చేయగా పట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి లక్ష్మారెడ్డిని మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ కార్యకర్తలపై నిరంతరం కేసులు పెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు.