మాచర్ల మండలం తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలను అధికారులు, గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు గురువారం సందర్శించారు. పాఠశాలలో వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్యనారాయణ, అమర నాగేశ్వరరావు, చింతకాయల ఆంజనేయులు, రామారావు, వెంకటేష్ నాయక్, పంచాయతీ సెక్రెటరీ వెంకటరామయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామాంజి నాయక్ పాల్గొన్నారు.