ఈనెల 20వ తేదీ నుండి అక్టోబరు 18 వరకు ఓటర్లు జాబితాలో సవరణలు, నూతన ఓటర్లు నమోదు ప్రక్రియ జరుగుతుందని ఓటర్ల నమోదు అధికారి లక్ష్మీ కుమారి అన్నారు. మంగళగిరి నగరంలోని మండలపరిషత్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో శుక్రవారం వివిధశాఖల అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025 నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 18సం. నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.