తాడేపల్లి పరిధిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైపీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బుధవారం సమావేశమయ్యారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. సమావేశంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.