మంగళగిరి మండలంలో వేంచేసియున్న లక్ష్మీనరసింహుని ఆలయంలో బుధవారం బ్రిటీష్ హైకమిషనర్ లిండీ కామెరన్, ఆంధ్ర, తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఈవో రామకోటి రెడ్డి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘు రామన్, తెనాలి సబ్ కలెక్టర్, ప్రోటోకాల్ ఆఫీసర్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.