నకిలీ లేడీ అఘోరీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేడి అఘోరీ చేతిలో సోమవారం తీవ్రంగా గాయపడిన బాధితుడు రాజు కోరాడు. మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితుడు మాట్లాడుతూ లేడీ అఘోరీ గంజాయి మత్తులో పోలీసులు, మీడియాపై దాడి చేస్తుంటే సానుకూలంగా మాట్లాడటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ అఘోరీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.