పల్నాడు జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా చంద్రకళ
పల్నాడు జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా చంద్రకళ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా ఆమె పల్నాడు జిల్లా నూతన డీఈవోగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించినందుకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు, ఇతర ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.