పల్నాడు జిల్లాస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయి అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు అర్జీలను సేకరించారు.