పత్తి రైతులు ఆ కేంద్రాల్లోనే అమ్ముకోవాలి: జాయింట్ కలెక్టర్
పత్తి రైతులు దళారుల దగ్గరకు వెళ్లకుండా పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏడు జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేసినట్లు తెలిపారు. పత్తి రైతులందరూ ఈ నెల 27 నుంచి రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.