నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ మంచినీటిని కాచి వడపోసిన తర్వాతే తాగాలని కమిషనర్ జస్వంత్ రావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని 34 వార్డులకు ఉదయం, సాయంత్రం నీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. మంచినీరు కలుషితమై మురుగునీరు వచ్చిన ఎడల తక్షణమే పురపాలక సంఘంలోని ఫిట్టర్లకు తెలియజేయాలని సూచించారు. తదుపరి చర్యలు తాము తీసుకుంటామని తెలిపారు.