ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందంగా, ఆహ్లాదకరంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం జాయింట్ కలెక్టర్ సూరజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, తదితర అంశాలపై డిఆర్వో, ఆర్డీవోలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.