ఒంగోలు జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు ఏర్పాటు
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని లక్ష్యంతో ఒంగోలులో గురువారం కలెక్టరేట్ నుండి ఆశా కార్యకర్తలతో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఒంగోలు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.