కొత్తపట్నం: రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి

55చూసినవారు
కొత్తపట్నం: రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి
రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అధికారులకు తెలిపారు. కొత్తపట్నంలో బుధవారం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రెవెన్యూ సమస్యలపై వినతి పత్రాలను ప్రజల నుండి ఎమ్మెల్యే అందుకున్నారు.

సంబంధిత పోస్ట్