టిడిపి కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన కనిగిరి ఎమ్మెల్యే
అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ప్రజల సమస్యలను వినతుల రూపంలో స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి అర్జీదారుడి సమస్యలను పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.