పలమనేరు: అవినీతి అధికారులను వదిలిపెట్టం: టీడీపీ
అవినీతి అధికారులను వదిలి పెట్టమని టీడీపీ అధికార ప్రతినిధి ఎన్. బి సుధాకర్ రెడ్డి ఆదివారం హెచ్చరించారు. వైసీపీ పాలనలో అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులు ఇప్పటికీ అదే దారిలో నడుస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిని కొందరు బెదిరిస్తున్నారన్నారు. గతంలో శ్రీకాళహస్తిలో పనిచేసిన ఓ మహిళా సీఐ శనివారం రాత్రి ఒక జర్నలిస్టు భార్య కు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు.