చిత్తూరు: లైసెన్స్ లేకుండా టపాకాయలు అమ్మితే చర్యలు: తాలూకా సిఐ

84చూసినవారు
లైసెన్స్ లేకుండా టపాకాయలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని చిత్తూరు తాలూకా సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని లైసెన్స్ లేకుండా టపాకాయలు విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు. దీంతోపాటు ఎక్కడా విడిగా పెట్రోలు విక్రయించరాదన్నారు. గంజాయి, మద్యం, నాటు సారా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నేడు మీడియా సమావేశంలో హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్