చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా తవణంపల్లి మండలంలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. సరకల్లు రామన్న చెరువు వద్ద గమగమ్మ పరవళ్లు తొక్కడంతో పరిసర ప్రాంతాల ప్రజలు మంగళవారం చెరువు వద్దకు చేరుకొని ఆనందం వ్యక్తం చేశారు.