హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఏలూరికి అభినందనల వెల్లువ

62చూసినవారు
పర్చూరులో ముచ్చటగా మూడోసారి టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏలూరి సాంబశివరావు ను అభినందించడానికి బుధవారం ఆయన క్యాంపు కార్యాలయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పోటెత్తారు. దీంతో అక్కడి వాతావరణం జాతరను తలపించింది. ఏలూరి అనుకూల నినాదాలు హోరెత్తాయి. కాబోయే మంత్రి అన్న వ్యాఖ్యానాలు కూడా వినవచ్చాయి. తనను అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఏలూరి ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్