గత రెండు రోజులుగా పల్నాడు జిల్లాలో కురుస్తున్న విస్తృత వర్షాలు దృష్ట్యా అమరావతి మండలంలో మూడు లంక గ్రామాలలో చిక్కుకున్న 36 మందిని మరియు 1150 జీవాలను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు చొరవతో ధరణి కోట గ్రామంలోని సురక్షిత( బోర్డు సెంటర్) ప్రాంతానికి సంబంధిత రెవెన్యూ సిబ్బంది తక్షణమే తరలించారు. ఆదివారం ధరణి కోట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు.