గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా..శనివారం రోడ్ల మరమ్మత్తుల పనులను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ
, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నరేంద్ర, గ్రామ పార్టీ అధ్యక్షుడు రావి శివరామకృష్ణయ్య, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు చాగంటి సత్యహర్ష, జిల్లా ఉపాధ్యక్షుడు జంపని హనుమంతారావు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.