రేపల్లె మండలం లో నిబంధనలకు విరుద్ధంగా వివోఏ ల అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణి లాల్ కోరారు. మంగళవారం రేపల్లె పట్టణంలోని ఇందిరా క్రాంతి పదం కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏపీఎం కి వినంతకి పత్రం అందజేశారు. రేపల్లె మండలంలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న 8 మంది వివోఏ లని అక్రమంగా తొలగించారు అన్నారు.