ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్క పౌరుడి నైతిక బాధ్యత అని రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపాల్ వీణ అన్నారు. ఆదివారం రేపల్లె రూరల్ మండలం పెనుమూడి గ్రామంలో వరదల కారణంగా సర్వం కోల్పోయిన 160 కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు. రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ మరియు మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.