రేపల్లె: ఎన్టీఆర్ కు నివాళులర్పించిన మంత్రి సత్యప్రసాద్

69చూసినవారు
బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారంలో భాగస్వామి కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టిడిపి వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శనివారం రేపల్లె లోని టిడిపి కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదల జీవితాలలో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్