ఒంగోలు: జాబ్ మేళాకు 1262 మంది ఎంపిక
ఒంగోలులోని ఏ1 ఫంక్షన్ హాల్ లో బుధవారం జాబ్ మేళా ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేలాదిమంది నిరుద్యోగులు తరలివచ్చారు. నిర్వాహకులు మాట్లాడుతూ షార్ప్ ఇండియా వారి సహకారంతో 38 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని, 3,650 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 1,262 మంది ఉద్యోగాలు సంపాదించినట్లుగా తెలిపారు. ఎంపికైన వారందరికీ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆఫర్ లెటర్లు అందజేశారు.