గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులు జలమయం అయ్యాయి. చీమకుర్తి మండలం బోదవాడ గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వర్షాల కారణంగా కర్నూలు - నంద్యాల రహదారి లో వర్షపు నీటితో చెరువును తలపిస్తుంది. వాహనాలు ఈ రహదారిపై వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రహదారి గుండా నిత్యం ట్రాఫిక్ ఉంటూనే ఉండటంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.