
సంతనూతలపాడు: ఎన్నికల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి
ఎంపీటీసీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీడియోల రూపంలో సాక్ష్యాలు ఉన్నా ఈసీ ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించారు. అక్రమాలకు వంతపాడిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.