నకరికల్లు మండలంలోని నరసింగపాడులో ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం సందర్శించారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, దర్శించుకున్నారు. అనంతరం ఆలయ చరిత్ర తెలిపే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.