సత్తెనపల్లిలో వైసీపీ కార్యకర్తపై సోమవారం సాయంత్రం కొందరు యువకులు కత్తితో దాడి చేశారు. పాతకక్ష్యల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. బాధితుడు సత్తెనపల్లి మున్సిపల్ వైస్ ఛైర్మన్ నాగుల్ మీరా మేనల్లుడుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.