సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను గురువారం సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ అందించడం జరిగింది. రాజుపాలెం మండలం కుబాద్ పురం గ్రామానికి చెందిన చింకా శేషగిరికి 1, 62, 000రూపాయలు, ఇనిమెట్ల గ్రామానికి చెందిన చుండు కోమలిదేవికి 2, 24, 100రూపాయలు, సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ళ గ్రామానికి చెందిన తోట రమాదేవికి అందజేశారు.