కొల్లిపర మండలంలోని రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్సై కోటేశ్వరరావు అన్నారు. బుధవారం రాత్రి కొల్లిపరలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గొడవల్లో, ఇతర అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలుంటాయని, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్సై కోటేశ్వరరావు హెచ్చరించారు.