తుళ్లూరు మండల పరిధిలోని ఉద్దండరాయునిపాలెం ఇసుక ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక లారీలను తుళ్లూరు పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. అక్రమ రవాణా వాహనాలకు పైలెట్ చేస్తున్న ఓ కారును కూడా అదుపులోకి తీసుకొని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వారిలో బాపట్ల మాజీ ఎంపీ సురేష్ అనుచరులు ఉన్నట్టు సమాచారం.