మంత్రి లోకేశ్‌కు తుని ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణికులకు వినోదం పంచడానికి సరదాగా ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న లోకేశ్ అధికారులతో మాట్లాడి ఉద్యోగం తిరిగి ఇప్పించారు. మంగళవారం విధుల్లో చేరిన లోవరాజు లోకేశ్‌కి, తుని ఆర్టీసీ డీఎంకి రుణపడి ఉంటానని తెలిపాడు.