అంగన్వాడి కేంద్రాలలో ముగిసిన తల్లి పాల వారోత్సవాలు

85చూసినవారు
అంగన్వాడి కేంద్రాలలో ముగిసిన తల్లి పాల వారోత్సవాలు
గత వారం రోజులుగా అంగన్వాడీ కేంద్రాలలో జరుగుతున్న తల్లి పాల వారోత్సవాలు బుధవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా సూపర్వైజర్లు విజయలక్ష్మి, నాగ రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుండి 7 వరకు కొల్లూరు మండలంలోని 67 కేంద్రాల్లో తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ తల్లులు, బాలింతలకు ర్యాలీలు, సమావేశాలను నిర్వహించామన్నారు. తల్లి పాల విశిష్టత పై క్విజ్ పోటీలను నిర్వహించి తల్లులకు బహుమతులను అందజేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్