తురకపాలెం గ్రామానికి చెందిన వాగోలు కోటేశ్వరరావు బైక్ పై ప్రయాణిస్తూ అదుపుతప్పి పడటంతో ముఖానికి గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కోటేశ్వరరావు వెల్లటూరుకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని అన్నారు. కాలువలో ఉన్న మోడు ముఖానికి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భట్టిప్రోలు ఎస్సై మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.