వినుకొండ పట్టణ ఎస్ఐ గా సమీర్ భాషా శనివారం భాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా రాజుపాలెం లో విధులు నిర్వహిస్తున్న భాషా వినుకొండ టౌన్ పోలీసు స్టేషన్ కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ భాషా ను స్టేషన్ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు.