పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఆకస్మిక వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ చేపట్టారు. పల్నాడు జిల్లాలోని వినుకొండ, నరసరావుపేట, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేటలో బుధవారం రాత్రి తనిఖీలు చేశారు. అనంతరం వారు జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని వాహనాలను స్టేషన్ కు తరలించారు.