ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు నిరసనగా బీఎస్పీ సహా పలు సంఘాలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీల విషయంలో అయోమయం నెలకొంది. ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇవాళ సెలవు ప్రకటించారు. మరో వైపు ఈ రోజు సెలవు అని స్కూళ్ల నుంచి తల్లిదండ్రులకు మెసేజులు రాలేదు. ఎవరైనా స్కూళ్లు, కాలేజీలకు వచ్చి ఆందోళన చేపడితే సెలవు ఇవ్వాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి మీ పిల్లలను ఇవాళ స్కూల్‌కు పంపుతున్నారా? లేదా? అనేది కామెంట్ చేయండి.