గడువుకు ముందే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి: రామ్మోహన్‌ నాయుడు

76చూసినవారు
గడువుకు ముందే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి: రామ్మోహన్‌ నాయుడు
భోగాపురం విమానాశ్రయానికి ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. పనుల్లో పురోగతిని ప్రతి నెల ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. గత నెల నుంచి ఇప్పటి వరకు 4 శాతం పురోగతి ఉందని చెప్పారు. విమానాశ్రయ పనుల్లో ఇప్పటి వరకు 36 శాతం పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేస్తామని చెప్పారు. పనులు అనుకున్న సమయం కంటే వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్