మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన రికార్డ్ నమోదైంది. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 3,73,691 మంది ప్రేక్షకులు (5 రోజుల్లో) హాజరయ్యారు. ఈ క్రమంలో 88 ఏళ్ల రికార్డును ఈ మ్యాచ్ బ్రేక్ చేసింది. 1936-37 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌కు 3,50,534 మంది (అప్పట్లో టెస్ట్ మ్యాచ్ ఆరు రోజుల పాటు జరిగేది) హాజరయ్యారు.