ప్రముఖ ఈవీ వాహనాల తయారీ సంస్థ ఏథర్ సహా మరో ఐదు కంపెనీల పబ్లిక్ ఇష్యూకు సెబీ (SEBI) పచ్చ జెండా ఊపింది. సెప్టెంబర్ 10 నుంచి 23 మధ్య ఆయా కంపెనీలు సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించాయి. తాజాగా సెబీ వాటికి ఆమోదం తెలిపింది. ఇందులో ఏథర్ ఎనర్జీ, ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ లిమిటెడ్, ఓస్వాల్ పంప్స్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్, ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్, స్లోస్ బెంగళూరు లిమిటెడ్ ఉన్నాయి.