ఏపీలోని యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు చేస్తామని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో వర్సిటీల్లో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించనున్నట్లు తెలిపారు.