పాఠశాలల్లో పిల్లలకు లైంగిక విద్యపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. లైంగిక విద్య విదేశాల్లోని విధానమని, దీనిని మన దేశంలో అమలు చేస్తే పిల్లలు చెడిపోతారనే దురభిప్రాయం ఉందని పేర్కొంది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం లైంగిక విద్య అమలు చేస్తున్న దేశాల్లో లైంగిక హింస, లైంగిక నేరాలకు అలవాటు పడడం తగ్గుతుందని వివరించింది. లింగ సమానత్వం కూడా సాధ్యపడుతుందని అభిప్రాయపడింది.