గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం దళితవాడలో ప్రచారం నిర్వహించారు. అయితే తమ వాడకు రావొద్దంటూ దళిత సంఘాలు ఆందోళన చేశారు. ‘గుడివాడ గడ్డ.. కొడాలి నాని అడ్డా’ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. దాంతో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము వెనుదిరిగారు.