ఏపీలో బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం కావడం ఖాయమని అనిపిస్తోంది. ఒకవేళ కూటమి అధికారంలోకి రాకపోయినా.. పవన్‌కు బీజేపీ బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకపోతే.. పవన్‌ను కేంద్రంలో సహాయ మంత్రిని చేయాలనేది బీజేపీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.