తమ్ముళ్ల తీరు పలు విధాలుగా ఉంది. ఎంత దాద్దామనుకున్నా.. తమ్ముళ్లు దాచలేని స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఒకరు ఇసుకంటే.. మరొకరు లిక్కర్ అంటున్నారు. ఒకప్పుడు వైసీపీలో నాయకులు రెచ్చిపోవడానికి కొంత సమయం తీసుకున్నారు. తొలి రెండేళ్లు హద్దుల్లోనే ఉన్నారు. కానీ.. ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చీరావడంతోనే తమ్ముళ్లు గల్లాలు తెరిచేశారు. ఈ పరిణామమే ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేస్తోంది. మరీ చంద్రబాబు నేతల దూకుడుకు ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి.