పోస్టల్ వ్యవస్థ సక్రమంగా లేని రోజుల్లోనే మన దేశంలోని బొంబాయిలో 1727లో పోస్ట్ ఆఫీస్ సెట్ అప్ ఏర్పాటు చేశారు. 1727లో బొంబాయిలో తపాలా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం స్థలంలో 1774లో భారతదేశానికి మొదటి జనరల్ పోస్ట్ ఆఫీస్‌గా పేర్కొంటారు. ఇది 1774 మార్చి 31న ఏర్పాటు చేయడం జరిగింది. 1864లో వాల్టర్ బి.గ్రెన్‌విల్లే జనరల్ పోస్ట్ ఆఫీస్ అధికారిక భవన నిర్మాణానికి బాధ్యత వహించి రూపొందించారు.