చేగువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా సెలా సెర్నా. 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోజలియాలో జన్మించిన చేగువేరా బాల్యంలో ఆస్తమా బాధితుడు. దీంతో పసివాడికి ఏమౌతుందో అని భయపడుతూ అతని తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు. 1953లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తర్వాత యుక్త వయసులోనే లాటిన్ అమెరికా అంతా పర్యటించి, అక్కడి దారిద్యం అసమానతలను చూసి చలించిపోయాడు. ఈ అనుభవాలు అయనలో విప్లవ భావాలను రగిలించాయి.