ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన భూమి, అందులో భవన నిర్మాణ ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. శారదా పీఠానికి 2023 డిసెంబర్ 26న అప్పటి టీటీడీ బోర్డు చేసిన భూ కేటాయింపు, భవన నిర్మాణానికి సంబంధించిన తీర్మానం ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు టీటీడీ ఈవోకు దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.