మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు

68చూసినవారు
మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు
వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు అయింది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితిపై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధ్రువీకరిస్తున్నానన్నారు. చంద్రబాబును ఆస్పత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాతే అసెంబ్లీ అనుమతించాలని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్