వైసీపీ ఎమ్మెల్సీ ఆరోపణలు.. మంత్రి లోకేశ్‌ ఆగ్రహం

79చూసినవారు
వైసీపీ ఎమ్మెల్సీ ఆరోపణలు.. మంత్రి లోకేశ్‌ ఆగ్రహం
AP: రాష్ట్రంలో పాఠశాలల హేతుబద్ధీకరణపై శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వాడీవేడి చర్చ జరిగింది. కొత్త విద్యావిధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు.  హిందూ మతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారన్నారు. దీంతో రవీంద్రబాబు ఆరోపణలపై లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్‌ మార్పు చేశారనడం సరికాదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్